అనపర్తి, జూలై 23 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో రూ.14.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న MPUP స్కూల్ భవన నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రంగంపేట మండల కూటమి నాయకులు, కోటపాడు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



