*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఆదివారం 18 2026 పున్నమి న్యూస్
*కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పదవికి 10 మంది అభ్యర్థుల నామినేషన్లు*
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రెబల్, డమ్మీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు.
తెలుగుదేశం పార్టీ తరఫున కన్నెకంటి అమూల్య నామినేషన్ దాఖలు చేయగా, ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా అమ్మాజీ (వల్లూరు జమాయిల్ దేవ కుమారి) నామినేషన్ వేశారు. అదేవిధంగా, టీడీపీ డమ్మీ అభ్యర్థిగా కన్నెకంటి సురేఖ నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున కటికల సుగుణ బరిలో నిలవగా, ఆ పార్టీ డమ్మీ అభ్యర్థిగా పురిటిగడ్డ అన్నపూర్ణ నామినేషన్ వేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నల్లమోతు తేజస్వి నామినేషన్ దాఖలు చేయగా, డమ్మీ అభ్యర్థిగా నల్లమోతు ప్రియాంక నామినేషన్ వేశారు.
బీజేపీ రెబల్ అభ్యర్థిగా తురక సుష్మ, బీసీవై పార్టీ అభ్యర్థిగా పగిడిపల్లి లక్ష్మీ ప్రసన్న నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పరగటి సుమలత నామినేషన్ వేశారు.
మొత్తంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పదవికి 10 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం బరిలో ఎంతమంది అభ్యర్థులు మిగులుతారన్నది ఉత్కంఠగా మారింది.

