Friday, 2 October 2026
  • Home  
  • కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి – ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
- చిత్తూరు

కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి – ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

పత్రికా ప్రకటన 01.10.2026 *********** కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి * ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు, అక్టోబర్ 01 ( పున్నమి ప్రతినిధి ) : రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. గురువారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 46 వార్డు పాంచాలిపురంలో లబ్ధిదారుల ఇంటికి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులను, మంచానికే పరిమితమైన వారిని ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పింఛను సొమ్ములను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సత్వరం పెంచి ఇస్తున్న పింఛను సొమ్ములు కారణంగా లక్షలాది కుటుంబాలకు ఆసరా లభిచిందన్నారు. చాలామంది లబ్ధిదారులు‌ పింఛను సొమ్ములు పెంచి ఇస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కొత్త పింఛన్లు మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని, ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహ ప్రసాద్, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, తెదేపా పరిశీలకులు కుమారి, క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పత్రికా ప్రకటన
01.10.2026
***********

కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి

* ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు, అక్టోబర్ 01 ( పున్నమి ప్రతినిధి ) : రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. గురువారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 46 వార్డు పాంచాలిపురంలో లబ్ధిదారుల ఇంటికి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులను, మంచానికే పరిమితమైన వారిని ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పింఛను సొమ్ములను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సత్వరం పెంచి ఇస్తున్న పింఛను సొమ్ములు కారణంగా లక్షలాది కుటుంబాలకు ఆసరా లభిచిందన్నారు. చాలామంది లబ్ధిదారులు‌ పింఛను సొమ్ములు పెంచి ఇస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కొత్త పింఛన్లు మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని, ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహ ప్రసాద్, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, తెదేపా పరిశీలకులు కుమారి, క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.