Sunday, 16 August 2026
  • Home  
  • కన్నుల పండువగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- నిర్మల్

కన్నుల పండువగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆగస్ట్ 15 (పున్నమి ప్రతినిధి ముధోల్) ముధోల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహనీయుల వేషధారణ మండల కేంద్రమైన ముధోల్‌తో పాటు వివిధ గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామపంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీలత, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి లక్ష్మణ్ బటేకర్, పోలీస్ స్టేషన్‌లో సీఐ రవీందర్ నాయక్, సహకార సంఘంలో పీఏసీఎస్ చైర్మన్ సాయిరామ్, గ్రామపంచాయతీలో సర్పంచ్ షబానా ఎజాజ్ ఉద్దీన్, ఎమ్మార్సీ కార్యాలయంలో మండల విద్యాధికారి రమణారెడ్డి, వ్యవసాయ పరిశోధన స్థానంలో డాక్టర్ దినేష్, ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ రాజశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏఓ రచన జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సూర్యదాస్ మహాడే, బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు గీత, రబీంద్రా పాఠశాలలో ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్, గిర్వాని డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ భీమ్రావు దేశాయ్, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ప్రిన్సిపాల్ నజీబ్ ఖాన్, అక్షర పాఠశాలలో డైరెక్టర్ సుభాష్ జారికోటే, సంకల్ప్ వ్యాలీలో డైరెక్టర్ శేషరావుతో పాటు వివిధ గ్రామపంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీవో శివకుమార్, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ఆగస్ట్ 15 (పున్నమి ప్రతినిధి ముధోల్) ముధోల్ లో
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహనీయుల వేషధారణ

మండల కేంద్రమైన ముధోల్‌తో పాటు వివిధ గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామపంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీలత, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి లక్ష్మణ్ బటేకర్, పోలీస్ స్టేషన్‌లో సీఐ రవీందర్ నాయక్, సహకార సంఘంలో పీఏసీఎస్ చైర్మన్ సాయిరామ్, గ్రామపంచాయతీలో సర్పంచ్ షబానా ఎజాజ్ ఉద్దీన్, ఎమ్మార్సీ కార్యాలయంలో మండల విద్యాధికారి రమణారెడ్డి, వ్యవసాయ పరిశోధన స్థానంలో డాక్టర్ దినేష్, ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ రాజశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏఓ రచన జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సూర్యదాస్ మహాడే, బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు గీత, రబీంద్రా పాఠశాలలో ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్, గిర్వాని డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ భీమ్రావు దేశాయ్, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ప్రిన్సిపాల్ నజీబ్ ఖాన్, అక్షర పాఠశాలలో డైరెక్టర్ సుభాష్ జారికోటే, సంకల్ప్ వ్యాలీలో డైరెక్టర్ శేషరావుతో పాటు వివిధ గ్రామపంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీవో శివకుమార్, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.