Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణంలో ఘనంగా గడప పూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణంలో ఘనంగా గడప పూజ

వార్త ముఖ్యాంశాలు

  • క్రిష్ణ మండలం కున్సి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ బనద రేణుకా ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మహత్తరమైన గడప పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
  • శ్రీ మహేష్ స్వామి, ప్రధాన అర్చకులు పూజారి శరణప్ప ఆధ్వర్యంలో ముందుగా వినాయక, కలశ పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడి, అంతరాలయంలో గడప పూజ చేసి గడపలను ప్రతిష్ఠించారు.
  • దేవాలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ బనద రేణుకా ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మహత్తరమైన గడప పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ మహేష్ స్వామి, ప్రధాన అర్చకులు పూజారి శరణప్ప ఆధ్వర్యంలో ముందుగా వినాయక, కలశ పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడి, అంతరాలయంలో గడప పూజ చేసి గడపలను ప్రతిష్ఠించారు. దేవాలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ప్రముఖులు, పెద్దలు, రైతులు, భక్తులు పాల్గొన్నారు. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ దైవ కార్యానికి విరాళాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా విరాళాలు అందించాల్సిన వారు ఈ నెలాఖరులోగా అమ్మవారి దేవాలయానికి అందించి సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలందరి సహకారంతో ఫిబ్రవరి నెలలో జరిగే అమ్మవారి జాతరలోపు దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవం నిర్వహించాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *