వార్త ముఖ్యాంశాలు
- వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీకి చెందిన నాయకులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా చర్చించారు.
- ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీకి చెందిన నాయకులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి నాయకులందరూ సమిష్టిగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఊటుకూరు పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.