వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: మండలంలోని అప్పసముద్రం, గుడినరవ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి విజయభాస్కర్ రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు.
- వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, సాగునీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఉదయగిరి: మండలంలోని అప్పసముద్రం, గుడినరవ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి విజయభాస్కర్ రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, సాగునీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలను సాగు చేస్తూ, వారి సలహాలు పాటించాలని కోరారు. ఆధునిక సాగు పద్ధతులను అనుసరించి, పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటూ మెరుగైన దిగుబడులు సాధించాలని రైతులకు వివరించారు.