వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరిలో పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ..
- పాఠశాలకు ఫ్యాన్ల వితరణ ఉదయగిరి: పేద విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారి అవసరాలకు సహకరించాలనే ఉద్దేశంతో ఖాదరియా ఆస్థానా అధ్యక్షుడు అహ్మద్ బాషా ఖాలిదీ సేవా కార్యక్రమం నిర్వహించారు.
- శుక్రవారం స్థానిక ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 51 మంది విద్యార్థులకు దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఉదయగిరిలో పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ.. పాఠశాలకు ఫ్యాన్ల వితరణ
ఉదయగిరి: పేద విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారి అవసరాలకు సహకరించాలనే ఉద్దేశంతో ఖాదరియా ఆస్థానా అధ్యక్షుడు అహ్మద్ బాషా ఖాలిదీ సేవా కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 51 మంది విద్యార్థులకు దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు రెండు సీలింగ్ ఫ్యాన్లను కూడా వితరణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ కరీం పాల్గొన్నారు. విద్యార్థులకు దుస్తులు, మిఠాయిలు అందజేయడంతో పాటు పాఠశాలకు ఫ్యాన్లు సమకూర్చడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.