Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

ఇరవెండిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇరవెండిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

ఇరవెండి: శ్రావణమాసం సందర్భంగా ఇరవెండి గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాన్ని ముదిరాజ్‌ కులబంధువుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా తలపై బోనాలు ఎత్తుకుని, వేపమండలతో అలంకరించిన అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు. గ్రామంలోని మహిళలు, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ పెద్దలు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ముత్యాలమ్మ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో ఈ వేడుకలను ఐక్యతతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *