*హజరత్ జల్ జలే సాహెబ్ పంజా పునఃనిర్మాణానికి శంకుస్థాపన*
ఇబ్రహీంపట్నం, నవంబర్ 20,
కొండపల్లి లో 400 సంవత్సరాల పైగా పురాతన చరిత్ర గల పీర్ల పంజా పునః నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. పంజా భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు నిర్మాణ సంస్థ స్వచ్ఛందంగా నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం పంజా కమిటీ, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే పీర్ల పండుగ మొహరం నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా పాల్గొని ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్రావు (గాంధీ), డిసిసి అధ్యక్షులు బోర్ర కిరణ్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ అప్సర్, కౌన్సిలర్లు బొలియా శెట్టి విజయదుర్గ శ్రీకాంత్, చుట్టుకుదురు శ్రీనివాసరావు, పంజా ముజావర్లు షమ్మీ, రామాంజనేయులు, దిల్షాద్, బొర్రా క్రాంతి కుమార్, బ్రహ్మాజీ, అక్కల ప్రసాద్,గోపి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు

