Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా కే. శిరీషకే అవకాశం,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరు వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా కే. శిరీషకే అవకాశం,

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు: మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది.
  • జనసేన పార్టీ తరఫున వైస్ ఛైర్మన్ పదవికి ప్రకటించిన కే.
  • శిరీష పేరుకు బదులుగా మంత్రి ఆనం మరో అభ్యర్థి పేరును ప్రతిపాదించడంతో వివాదం తలెత్తింది.

ఆత్మకూరు: మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీ తరఫున వైస్ ఛైర్మన్ పదవికి ప్రకటించిన కే. శిరీష పేరుకు బదులుగా మంత్రి ఆనం మరో అభ్యర్థి పేరును ప్రతిపాదించడంతో వివాదం తలెత్తింది. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన ప్రకటించిన అభ్యర్థి కే. శిరీషనే వైస్ ఛైర్మన్ పదవికి ప్రతిపాదించాలని ఆర్డీవో పావని స్పష్టం చేసినట్లు సమాచారం. మంత్రి ప్రతిపాదించిన మరో పేరు చెల్లదని ఆమె ప్రకటించారు.దీంతో మంగళవారం (నవంబర్ 24) మరోసారి మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కే. శిరీషను వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకునే ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో ఆత్మకూరు మున్సిపల్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *