క్యూబాపై అమెరికా పెంచుతున్న ఆర్థిక, రాజకీయ ఒత్తిడిపై ఆ దేశ అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్-కనెల్ స్పందించారు. అమెరికా మూడు రకాల వ్యూహాలను అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు. సామాజిక అస్థిరతను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ సాధించడం లేదా సైనిక చర్యలకు దిగడం వంటి మార్గాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా విధించిన ఆంక్షలు, ఇంధన సరఫరా పరిమితులు క్యూబా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా ఒత్తిడిపై క్యూబా అధ్యక్షుడి వ్యాఖ్యలు