ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
తల్లాడ/ఖమ్మం
ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బీజేపీ నాయకుడు ఆపతి వెంకట రామారావు, తల్లాడ మండలంలోని అన్నారుగూడెం క్లస్టర్‌కు పూర్తిస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ని వెంటనే నియమించాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత మూడు నెలలుగా ఏఈఓ లేక రైతులు పంటల సాగు, ప్రభుత్వ పథకాల అమలు, పంట నమోదు, ఎరువులు, విత్తనాల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సమస్యను పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దివాకర్ టీ. యస్ ఆదేశించినట్లు తెలిపారు.



