వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 16(పున్నమి తెలుగు దినపత్రిక )..
- పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వై.
- యస్ ఆర్ పార్టీ అధిష్టానం బలపరిచి, పార్టీ కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ అశీసులలతో పోటీలో వున్న షేక్.
పామూరు, నవంబర్ 16(పున్నమి తెలుగు దినపత్రిక ).. పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వై. యస్ ఆర్ పార్టీ అధిష్టానం బలపరిచి, పార్టీ కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ అశీసులలతో పోటీలో వున్న షేక్. చాంద్ బాషా (బుజ్జి భాయ్ )అందరివాడని, ఎవరికి అందనివాడని, పంచాయతీ ఓటరు అభిప్రాయపడి,ఏకపక్ష నిర్ణయంతో, చాంద్ బాషా ని గెలిపించి తీరుతామని మేజర్ పంచాయతీ ఓటరు మరియు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం..ప్రస్తుత పామూరు సర్పంచ్ ఎన్నికల మేజర్ ఓటరు గాలి చాంద్ బాషా వైపు బలంగా వీచే పరిస్థితి ఎక్కువగా ఉందని ఈ బలమైన రాజకీయ గాలిని ఆపడం ఎవరికి సాధ్యం కాదని స్థానిక ప్రజలు అభిప్రాయ పడుతున్నారు..పోటీలో వున్న పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులలో ఎవరు స్థానికులో ఓటరు తమ పవిత్రమైన ఓటుహక్కుతో నిర్ణయం తీసుకోవాలని పట్టణ ప్రజల విజ్ఞప్తి.. భారత రాజ్యాంగం ప్రకారం ప్రాధమిక హక్కులలో ఒకటైన ఓటుహక్కు ని సరైన నాయకుడికి వేసి, సర్పంచ్ పీఠం బహుమతిగా ఇవ్వాలని పండిత, పామరులు కోరుకుంటున్నారు..