Sunday, 27 September 2026
  • Home  
  • జీరో పావర్టీ–P4, నెట్ జీరో కుప్పం కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు..
- చిత్తూరు

జీరో పావర్టీ–P4, నెట్ జీరో కుప్పం కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు..

జీరో పావర్టీ–P4, నెట్ జీరో కుప్పం కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు.. కుప్పం సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి): న్యూఢిల్లీలో శనివారం జరిగిన 109వ స్కోచ్ సమ్మిట్‌లో కుప్పం తరఫున అవార్డు అందుకున్న కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్ అవార్డు కార్యక్రమానికి హాజరైన పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు. స్వర్ణ కుప్పం విజన్ 2029లో భాగంగా కుప్పం ప్రాంతంలో అమలు చేస్తున్న జీరో పావర్టీ–పీ4 (పబ్లిక్-పీపుల్-ప్రైవేట్-పార్ట్నర్షిప్) మరియు నెట్ జీరో కుప్పం కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక స్కోచ్ గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్‌లో ఈ కార్యక్రమాలకు సంబంధించిన అవార్డును కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్ గారు కుప్పం తరఫున అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి పి కే యం ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు కూడా హాజరయ్యారు. కుప్పం ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన మౌలిక వసతులు, ఆర్థిక అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలతో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణ కుప్పం–విజన్ 2029లో భాగంగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు కుటుంబ స్థాయి పరిష్కారాలతో పాటు సమాజ స్థాయిలో అవకాశాలను కల్పించే విధంగా పి4–పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్ విధానంలో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. పీ4 కార్యక్రమం ద్వారా కుప్పం ప్రాంతంలో గుర్తించిన 8,904 బంగారు కుటుంబాలను మార్గదర్శక సంస్థలైన అదానీ, టీవీఎస్, ఎం.ఈ.ఐ.ఎల్ తదితర సంస్థల సహకారంతో దత్తత తీసుకుని, కుటుంబాల అవసరాలకు అనుగుణంగా జీవనోపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. డెయిరీ, గొర్రెలు–మేకల పెంపకం, రిటైల్, టైలరింగ్, ఆహార వ్యాపారాలు, ఆటోలు, మినీ ఫ్లోర్ మిల్లులు, మెకానిక్ సెంటర్లు, సిల్క్ రీరింగ్, వ్యవసాయం తదితర రంగాల్లో కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన దిశగా సహాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు 1,217 కుటుంబాలకు 8.71 కోట్ల మేర మద్దతు అందించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ వంటి సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా కుప్పంను నెట్ జీరో నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దిశగా కడ, ఐఐటి కాన్పూర్ తదితర సంస్థల సహకారంతో వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలు అమలు చేస్తోంది. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్, గృహాలకు రూఫ్‌టాప్ సోలార్, ప్రభుత్వ హాస్టళ్లు మరియు విద్యాసంస్థల్లో సౌర విద్యుత్, స్మార్ట్ మీటరింగ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి కార్యక్రమాలను సమగ్రంగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడం, స్థానికంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచడం, స్థిరమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జీరో పావర్టీ–పీ4 మరియు నెట్ జీరో కుప్పం కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేస్తూ, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సాంకేతిక సంస్థలు మరియు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న కుప్పం విధానానికి 109వ స్కోచ్ సమ్మిట్‌లో లభించిన ఈ గుర్తింపు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. న్యూఢిల్లీలో జరిగిన అవార్డు కార్యక్రమంలో కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్ అవార్డును స్వీకరించగా, పీకేఎం యూడీఏ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు కార్యక్రమానికి హాజరై పాల్గొన్నారు.

జీరో పావర్టీ–P4, నెట్ జీరో కుప్పం కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు..

కుప్పం సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి): న్యూఢిల్లీలో శనివారం జరిగిన 109వ స్కోచ్ సమ్మిట్‌లో కుప్పం తరఫున అవార్డు అందుకున్న కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్
అవార్డు కార్యక్రమానికి హాజరైన పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు. స్వర్ణ కుప్పం విజన్ 2029లో భాగంగా కుప్పం ప్రాంతంలో అమలు చేస్తున్న జీరో పావర్టీ–పీ4 (పబ్లిక్-పీపుల్-ప్రైవేట్-పార్ట్నర్షిప్) మరియు నెట్ జీరో కుప్పం కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక స్కోచ్ గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్‌లో ఈ కార్యక్రమాలకు సంబంధించిన అవార్డును కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్ గారు కుప్పం తరఫున అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి పి కే యం ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు కూడా హాజరయ్యారు. కుప్పం ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన మౌలిక వసతులు, ఆర్థిక అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలతో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణ కుప్పం–విజన్ 2029లో భాగంగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు కుటుంబ స్థాయి పరిష్కారాలతో పాటు సమాజ స్థాయిలో అవకాశాలను కల్పించే విధంగా పి4–పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్ విధానంలో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. పీ4 కార్యక్రమం ద్వారా కుప్పం ప్రాంతంలో గుర్తించిన 8,904 బంగారు కుటుంబాలను మార్గదర్శక సంస్థలైన అదానీ, టీవీఎస్, ఎం.ఈ.ఐ.ఎల్ తదితర సంస్థల సహకారంతో దత్తత తీసుకుని, కుటుంబాల అవసరాలకు అనుగుణంగా జీవనోపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. డెయిరీ, గొర్రెలు–మేకల పెంపకం, రిటైల్, టైలరింగ్, ఆహార వ్యాపారాలు, ఆటోలు, మినీ ఫ్లోర్ మిల్లులు, మెకానిక్ సెంటర్లు, సిల్క్ రీరింగ్, వ్యవసాయం తదితర రంగాల్లో కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన దిశగా సహాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు 1,217 కుటుంబాలకు 8.71 కోట్ల మేర మద్దతు అందించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ, కో-వర్కింగ్ స్పేస్ వంటి సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా కుప్పంను నెట్ జీరో నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దిశగా కడ, ఐఐటి కాన్పూర్ తదితర సంస్థల సహకారంతో వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలు అమలు చేస్తోంది. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్, గృహాలకు రూఫ్‌టాప్ సోలార్, ప్రభుత్వ హాస్టళ్లు మరియు విద్యాసంస్థల్లో సౌర విద్యుత్, స్మార్ట్ మీటరింగ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి కార్యక్రమాలను సమగ్రంగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడం, స్థానికంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచడం, స్థిరమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జీరో పావర్టీ–పీ4 మరియు నెట్ జీరో కుప్పం కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేస్తూ, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సాంకేతిక సంస్థలు మరియు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న కుప్పం విధానానికి 109వ స్కోచ్ సమ్మిట్‌లో లభించిన ఈ గుర్తింపు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. న్యూఢిల్లీలో జరిగిన అవార్డు కార్యక్రమంలో కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్ అవార్డును స్వీకరించగా, పీకేఎం యూడీఏ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు కార్యక్రమానికి హాజరై పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.