Sunday, 5 July 2026
  • Home  
  • వంగవీటి రంగ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం- నరేంద్ర దండి
- తిరుపతి

వంగవీటి రంగ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం- నరేంద్ర దండి

శ్రీ కాళహస్తి, జులై 04 : (పున్నమి న్యూస్) : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, పేద ప్రజల సంక్షేమం కోసం వంగవీటి మోహన రంగ చేసిన సేవలు చిరస్మరణీయమని నరేంద్ర దండి పేర్కొన్నారు. రాధా రంగ మిత్ర మండలి జిల్లా అధ్యక్షుడు బొక్కిసం మునిసుబ్బయ్య ప్రత్యేక ఆహ్వానం మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించిన వంగవీటి మోహన రంగ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం రంగ జీవితాంతం పోరాడారని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన ఆశయాలు నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పగడాల సుధాకర్, పగడాల ప్రతాప్, కవితా రాణి, పూల కృష్ణయ్య, కోల వెంకటేశ్వర్లు, కె.వి. రమణ, కె. ప్రసాద్, పనపాటి కృష్ణ, ప్రదీప్‌తో పాటు పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు నరేంద్ర దండి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.