ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు వద్ద మున్నేరుపై ఉన్న పురాతన వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రత్యామ్నాయంగా రూ.180 కోట్ల అంచనా వ్యయంతో తీగల వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 420 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెనలో 300 మీటర్ల మేర తీగల వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే పాత వంతెనపై ఉన్న రవాణా ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. అంతేకాకుండా ఖమ్మం నగరంలో భవిష్యత్ రవాణా అవసరాలకు ఈ వంతెన కీలకంగా మారనుంది. ఆధునిక నిర్మాణంతో రూపుదిద్దుకుంటున్న ఈ బ్రిడ్జ్ పూర్తయితే నగర ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి.



