నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్య అతిథి అప్పిరెడ్డి తెలిపారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అరుణ మహిళా సాధికారత, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించగా… ప్రతినిధులు చంద్రశేఖర్, హరినాథ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్, ప్రాక్టికల్ అనుభవం, ఉపాధి అవకాశాల ప్రాముఖ్యతను వివరించారు. దేశ ఆర్థిక పురోగతిలో పరిశ్రమల పాత్ర కీలకమని పోతుల రత్నారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కళాశాల ఛైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు.

విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయం: శ్రీరామకృష్ణ కళాశాలలో అవగాహన సదస్సు