బొల్లిన రామకృష్ణ (రాములు )కి పూర్వ విద్యార్థులు ఘన నివాళి
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 21
నల్లజర్ల, దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామానికి చెందిన హైస్కూల్ స్థల దాతలు బొల్లిన గంగరాజు వారసులు బొల్లిన రామకృష్ణ రాములు ) మరణించిన వార్త తెలియగానే 2002-2005 సంవత్సరం పూర్వ విద్యార్థులు హుటా హుటిన వెళ్లి రాములు భౌతిక కాయం వద్ద వారితో వున్నా స్నేహబంధం మంచి పలకరింపు కలిగిన వ్యక్తిగా పేరు గాంచిన వారు అందుకు పూర్వ విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన మరణ వార్త వినగానే విద్యార్థులు యొక్క గుండెలు పగిలినంత పనయింది అని ఎంతగానో ప్రాలపించారు. విద్యార్థులు అందరు కలసి రాములు కి ఘన నివాళులు అర్పించారు. మరియు కుటుంబం సభ్యులు కి వారి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.
విద్యార్థులు మాటల్లో, రాములు ఎంతో మంచి వారని అందరిని ఎంతగానో మంచిగా పలకరించేవారని మంచి గుణము కలిగిన వ్యక్తి అని మంచి స్నేహసీలి అని గ్రామాన్ని ఎంతగానో తన పరిపాలనలో ముందికి నడిపించిన నాయకులు అని గ్రామ సర్పంచ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని రాములను గూర్చి చక్కగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


