Friday, 2 October 2026
  • Home  
  • పీఎం–కిసాన్ సేవలను సచివాలయాల పరిధిలోకి తేవాలి: ఆదివాసీ గిరిజన సంఘం
- అల్లూరి సీతారామరాజు

పీఎం–కిసాన్ సేవలను సచివాలయాల పరిధిలోకి తేవాలి: ఆదివాసీ గిరిజన సంఘం

అరకులోయ, అక్టోబర్ 1: పీఎం–కిసాన్ నగదు జమలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి మండల సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అరకు వేలీ మండలంలోని 14 పంచాయతీల్లో వందలాది మంది రైతులకు రెండు, మూడు విడతలుగా నగదు జమ కాలేదని సంఘం నాయకుడు గత్తుం బుజ్జిబాబు తెలిపారు. ఈ–కేవైసీ, ఆధార్ లింక్, ల్యాండ్ సీడింగ్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. CSC కేంద్రాల్లో సర్వర్ సమస్యలతో పాటు అధిక వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. పీఎం–కిసాన్ ఆన్‌లైన్ సేవలను గ్రామ సచివాలయాల్లోని VAA/VHAలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుంకరమెట్ట మాజీ సర్పంచ్ గెమ్మెల చిన్నబాబు, కొర్ర చిట్టిబాబు, కిల్లో అప్పారావు, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.