Friday, 2 October 2026
  • Home  
  • ప్రజాదర్బార్ తో ప్రజల సమస్యలు పరిష్కారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
- తూర్పు గోదావరి

ప్రజాదర్బార్ తో ప్రజల సమస్యలు పరిష్కారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 2 : స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆన్ స్పాట్ లో ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని, క్యాంప్ ఆఫీసుకు వస్తే చాలు సమస్య నేరుగా తన దృష్టికి వస్తుందని, గత ప్రభుత్వంలో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వంలో ప్రజలే సుప్రీం అని, ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా తనకు చెబితే పరిష్కారం చేయడం తన బాధ్యత అని, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను దశలవారీగా పూర్తి చేస్తామని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, కిర్లంపూడి మండల టిడిపి అధ్యక్షులు వీరం రెడ్డి కాశి బాబు, కిర్లంపూడి మాజీ ఎంపీపీ తోట రవి, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, బోదిరెడ్ల సుబ్బారావు, గండే కాశి, బొడ్డేటి సుమన్, పెదపాటి శుభకర్, వల్లెపు అన్నవరం, అప్పన వీరబాబు, రాపాక లక్ష్మి, కార్యకర్తలు, వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 2 :
స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆన్ స్పాట్ లో ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని, క్యాంప్ ఆఫీసుకు వస్తే చాలు సమస్య నేరుగా తన దృష్టికి వస్తుందని, గత ప్రభుత్వంలో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వంలో ప్రజలే సుప్రీం అని, ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా తనకు చెబితే పరిష్కారం చేయడం తన బాధ్యత అని, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను దశలవారీగా పూర్తి చేస్తామని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, కిర్లంపూడి మండల టిడిపి అధ్యక్షులు వీరం రెడ్డి కాశి బాబు, కిర్లంపూడి మాజీ ఎంపీపీ తోట రవి, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, బోదిరెడ్ల సుబ్బారావు, గండే కాశి, బొడ్డేటి సుమన్, పెదపాటి శుభకర్, వల్లెపు అన్నవరం, అప్పన వీరబాబు, రాపాక లక్ష్మి, కార్యకర్తలు, వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.