Friday, 18 September 2026
  • Home  
  • కోర్టు స్టే భూమిలో పంట ధ్వంసం.. రైతులను పరామర్శించిన మేకపాటి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోర్టు స్టే భూమిలో పంట ధ్వంసం.. రైతులను పరామర్శించిన మేకపాటి

కోటితీర్థం……. ఆత్మకూరు: కోటితీర్థంలో కోర్టు స్టే ఉన్న భూమిలోకి ప్రవేశించి జేసీబీతో వరి పైరును ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద పొలాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. వైసీపీ చేజర్ల మండల సమీక్ష సమావేశానికి వెళ్తున్న ఆయన మార్గమధ్యలో బాధిత రైతులను కలిశారు. ఘటనకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటకు జరిగిన నష్టం, భూమి వివాదానికి దారితీసిన పరిస్థితులపై రైతులతో మాట్లాడారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ పొలంలోకి ప్రవేశించి పంటను ధ్వంసం చేశారన్న రైతుల ఆరోపణలను ఆయన విన్నారు. ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకుని రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

కోటితీర్థం…….

ఆత్మకూరు: కోటితీర్థంలో కోర్టు స్టే ఉన్న భూమిలోకి ప్రవేశించి జేసీబీతో వరి పైరును ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద పొలాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. వైసీపీ చేజర్ల మండల సమీక్ష సమావేశానికి వెళ్తున్న ఆయన మార్గమధ్యలో బాధిత రైతులను కలిశారు. ఘటనకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటకు జరిగిన నష్టం, భూమి వివాదానికి దారితీసిన పరిస్థితులపై రైతులతో మాట్లాడారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ పొలంలోకి ప్రవేశించి పంటను ధ్వంసం చేశారన్న రైతుల ఆరోపణలను ఆయన విన్నారు. ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకుని రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.