Friday, 25 September 2026
  • Home  
  • జగ్గంపేటలో కూటమికి మరింత బలం
- తూర్పు గోదావరి

జగ్గంపేటలో కూటమికి మరింత బలం

కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 26: రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనసేన నాయకుడు జోకా శ్రీనివాస్ విజయ్ కుమార్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది జోకా శ్రీనివాస్ విజయ్ కుమార్ ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి మరింత బలోపేతం కావాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగరాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని విజయ్ కుమార్ కు సూచించారు.జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, రాజుపాలెం లాంటి గ్రామాల నుండి విద్యావంతులు, న్యాయవాదులు జనసేన, తెలుగుదేశం కూటమిలోకి రావడం శుభ పరిణామమని, కూటమి ఐక్యతతో ముందుకు వెళితే ఎన్ని ఎన్నికలైనా విజయం సాధించడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజుపాలెం మాజీ సర్పంచ్ గంధం ఈశ్వరరావు, మాజీ ఎంపిటిసి, మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గోడే దొరబాబు, కణిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 26:
రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనసేన నాయకుడు జోకా శ్రీనివాస్ విజయ్ కుమార్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది జోకా శ్రీనివాస్ విజయ్ కుమార్ ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి మరింత బలోపేతం కావాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగరాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని విజయ్ కుమార్ కు సూచించారు.జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, రాజుపాలెం లాంటి గ్రామాల నుండి విద్యావంతులు, న్యాయవాదులు జనసేన, తెలుగుదేశం కూటమిలోకి రావడం శుభ పరిణామమని, కూటమి ఐక్యతతో ముందుకు వెళితే ఎన్ని ఎన్నికలైనా విజయం సాధించడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజుపాలెం మాజీ సర్పంచ్ గంధం ఈశ్వరరావు, మాజీ ఎంపిటిసి, మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గోడే దొరబాబు, కణిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.