Tuesday, 22 September 2026
  • Home  
  • తాగునీటి సమస్యలు పరిష్కరించకపోవడంతో గ్రామసభ బహిష్కరణ
- నిర్మల్

తాగునీటి సమస్యలు పరిష్కరించకపోవడంతో గ్రామసభ బహిష్కరణ

కుబీర్ మండలం.నిఘ్వ:గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో తాగునీటి సమస్యలు, పారిశుధ్యంపై చర్చ జరిగింది. గతంలో నిర్వహించిన జనరల్‌ బాడీ సమావేశాలు, గ్రామసభల్లో చేసిన తీర్మానాల మేరకు ఎస్సీ కాలనీ, ఆబాజీ మొదటి వార్డులో తాగునీటి ఎద్దడి నివారణకు బోర్లు వేయాలని నిర్ణయించినా ఇప్పటివరకు పనులు చేపట్టలేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బోర్లు ఉన్న ప్రాంతాల్లో మినీ ట్యాంకులు, ఆరు నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని తీర్మానించినప్పటికీ అధికారులు, సర్పంచ్‌ స్పందించలేదని ఆరోపించారు. గ్రామంలోని తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత, పారిశుధ్యంపై కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉపసర్పంచ్‌ దిగంబర్‌ పటేల్‌తో పాటు వార్డు సభ్యులు బన్నెల్లి సత్యనారాయణ, అరవేకర్‌ పోతన్న, కోటగిరి ప్రవీణ్‌, పొదుగంటి లక్ష్మణ్‌, గుంజేటి రాధిక గ్రామసభను బహిష్కరించారు.

కుబీర్ మండలం.నిఘ్వ:గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో తాగునీటి సమస్యలు, పారిశుధ్యంపై చర్చ జరిగింది. గతంలో నిర్వహించిన జనరల్‌ బాడీ సమావేశాలు, గ్రామసభల్లో చేసిన తీర్మానాల మేరకు ఎస్సీ కాలనీ, ఆబాజీ మొదటి వార్డులో తాగునీటి ఎద్దడి నివారణకు బోర్లు వేయాలని నిర్ణయించినా ఇప్పటివరకు పనులు చేపట్టలేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే బోర్లు ఉన్న ప్రాంతాల్లో మినీ ట్యాంకులు, ఆరు నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని తీర్మానించినప్పటికీ అధికారులు, సర్పంచ్‌ స్పందించలేదని ఆరోపించారు. గ్రామంలోని తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత, పారిశుధ్యంపై కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉపసర్పంచ్‌ దిగంబర్‌ పటేల్‌తో పాటు వార్డు సభ్యులు బన్నెల్లి సత్యనారాయణ, అరవేకర్‌ పోతన్న, కోటగిరి ప్రవీణ్‌, పొదుగంటి లక్ష్మణ్‌, గుంజేటి రాధిక గ్రామసభను బహిష్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.