Tuesday, 29 September 2026
  • Home  
  • ఐఆర్‌సీఎస్ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం చైర్మన్‌గా డా. ఎస్.ఎల్. కాంతారావు.. వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు
- BHADRADRI

ఐఆర్‌సీఎస్ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం చైర్మన్‌గా డా. ఎస్.ఎల్. కాంతారావు.. వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు

కొత్తగూడెం, సెప్టెంబర్ 28: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ నూతన కమిటీ ఎన్నికలు సోమవారం కలెక్టరేట్‌లో ఏకగ్రీవంగా జరిగాయి. చైర్మన్‌గా డా. ఎస్.ఎల్. కాంతారావు, వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు, కోశాధికారిగా తోటమల్ల బాలయోగి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా వై. సూర్యనారాయణ ఎన్నికయ్యారు. మరో 11 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం నూతన కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ అంకిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించిన ఎన్నికల అధికారులను అభినందించారు. నూతన కమిటీ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఐఆర్‌సీఎస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని కలెక్టర్ సూచించారు. పాల్వంచలో ఐఆర్‌సీఎస్‌కు కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐఆర్‌సీఎస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కార్యక్రమాలు నిర్వహించేలా ఐక్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా శాఖ అభివృద్ధి, సేవా కార్యక్రమాల విస్తరణకు సమన్వయంతో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

కొత్తగూడెం, సెప్టెంబర్ 28: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ నూతన కమిటీ ఎన్నికలు సోమవారం కలెక్టరేట్‌లో ఏకగ్రీవంగా జరిగాయి. చైర్మన్‌గా డా. ఎస్.ఎల్. కాంతారావు, వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు, కోశాధికారిగా తోటమల్ల బాలయోగి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా వై. సూర్యనారాయణ ఎన్నికయ్యారు. మరో 11 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికల అనంతరం నూతన కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ అంకిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించిన ఎన్నికల అధికారులను అభినందించారు. నూతన కమిటీ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాలో ఐఆర్‌సీఎస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని కలెక్టర్ సూచించారు. పాల్వంచలో ఐఆర్‌సీఎస్‌కు కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐఆర్‌సీఎస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కార్యక్రమాలు నిర్వహించేలా ఐక్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించాలని అన్నారు.

జిల్లా శాఖ అభివృద్ధి, సేవా కార్యక్రమాల విస్తరణకు సమన్వయంతో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.