Saturday, 19 September 2026
  • Home  
  • ఏబీ న్యూ లైఫ్ ఆసుపత్రిలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు.. 2,500 మందికి అన్నదానం.. లడ్డూ వేలం, నిమజ్జన కార్యక్రమాలు
- రంగారెడ్డి

ఏబీ న్యూ లైఫ్ ఆసుపత్రిలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు.. 2,500 మందికి అన్నదానం.. లడ్డూ వేలం, నిమజ్జన కార్యక్రమాలు

ఉప్పల్: పీర్తాజిగూడలోని ఏబీ న్యూ లైఫ్ ఆసుపత్రిలో వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ఉప్పల్ ఫిర్దోజిగూడా ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్లుగా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మూడో రోజున 2 వేల నుంచి 2,500 మందికి అన్నదానం, ఐదో రోజున స్వామివారి లడ్డూ వేలం పాటతో పాటు నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఆసుపత్రిలో బహుళ వైద్య విభాగాలు, అన్ని రకాల శస్త్రచికిత్సలు, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. రోగులకు 30 నుంచి 50 శాతం వరకు రాయితీ, వైద్య పరీక్షల కేంద్రం, మందుల దుకాణం, 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వహణ సంచాలకులు భరత్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ బాలకృష్ణ, మహేష్, అరవింద్, సురేష్, విగ్నేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్: పీర్తాజిగూడలోని ఏబీ న్యూ లైఫ్ ఆసుపత్రిలో వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ఉప్పల్ ఫిర్దోజిగూడా ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.

గత ఐదేళ్లుగా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మూడో రోజున 2 వేల నుంచి 2,500 మందికి అన్నదానం, ఐదో రోజున స్వామివారి లడ్డూ వేలం పాటతో పాటు నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

ఆసుపత్రిలో బహుళ వైద్య విభాగాలు, అన్ని రకాల శస్త్రచికిత్సలు, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. రోగులకు 30 నుంచి 50 శాతం వరకు రాయితీ, వైద్య పరీక్షల కేంద్రం, మందుల దుకాణం, 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వహణ సంచాలకులు భరత్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ బాలకృష్ణ, మహేష్, అరవింద్, సురేష్, విగ్నేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.