Saturday, 26 September 2026
  • Home  
  • ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కరెంటు కష్టాలు
- తెలంగాణ - మహబూబాబాద్

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కరెంటు కష్టాలు

For scrolling /publish రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కే దుస్థితి: మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్ చెల్పూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ను బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సందర్శించింది భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని నినదించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ… “తెలంగాణలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన ప్రభుత్వం.. నేడు కరెంటు కోసం రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం రేవంత్ రెడ్డి పవర్ కట్ చేస్తేనే…రైతులకు పవర్ అందుతుంది..రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కరెంట్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాల్లో పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరాపై రైతుల్లో ఆందోళన నెలకొంది గతంలో తెలంగాణ రైతులకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ సహా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పరిస్థితి ఏమిటి? బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయి? యూనిట్లు ఎందుకు నిలిచిపోతున్నాయి? విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గుతోంది? రైతులకు సరిపడా విద్యుత్ ఎందుకు అందడం లేదు? అనే అంశాలపై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడానికే బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి” “ప్రజల ఆస్తులైన విద్యుత్ కేంద్రాల పరిస్థితిపై ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలి రైతులకు కరెంటు విషయంలో కాలయాపన, కోతలు, సాకులు కాకుండా తక్షణమే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే.. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది.” అని సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య ,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, బానోత్ శంకర్ నాయక్, ఆరూరి రమేష్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు Plz cover…..

For scrolling /publish

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కే దుస్థితి: మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్

చెల్పూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ను బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సందర్శించింది భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని నినదించారు

ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ…

“తెలంగాణలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన ప్రభుత్వం.. నేడు కరెంటు కోసం రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం

రేవంత్ రెడ్డి పవర్ కట్ చేస్తేనే…
రైతులకు పవర్ అందుతుంది..
రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కరెంట్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రైతుల పొలాల్లో పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరాపై రైతుల్లో ఆందోళన నెలకొంది గతంలో తెలంగాణ రైతులకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది

కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ సహా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పరిస్థితి ఏమిటి? బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయి? యూనిట్లు ఎందుకు నిలిచిపోతున్నాయి? విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గుతోంది? రైతులకు సరిపడా విద్యుత్ ఎందుకు అందడం లేదు? అనే అంశాలపై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడానికే బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి”

“ప్రజల ఆస్తులైన విద్యుత్ కేంద్రాల పరిస్థితిపై ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలి రైతులకు కరెంటు విషయంలో కాలయాపన, కోతలు, సాకులు కాకుండా తక్షణమే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే.. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది.” అని సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య ,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, బానోత్ శంకర్ నాయక్, ఆరూరి రమేష్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Plz cover…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.