*తడ, తిరుపతి జిల్లా:* తడ మండలంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన *అపాచీ ఫుట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (APACHE GROUP)* కంపెనీలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒక యువకుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో కంపెనీ పరిసరాల్లో కలకలం రేపింది.
*కార్మికుల ఆందోళన*
తడ మండలంలోని అపాచీ కంపెనీలో చోటుచేసుకుంటున్న ఘటనలపై పలువురు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులు, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారని నాయకులు తెలిపారు.
కంపెనీ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉద్యోగులు, కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కంపెనీ పరిసరాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు.


