Wednesday, 23 September 2026
  • Home  
  • తల్లికి వందనం రెండో విడత కోసం ఎదురుచూపులు – మొదటి విడతలో పేరు రాని వారికి మరో అవకాశం కల్పించండి. B. బంగార్రాజు
- విశాఖపట్నం

తల్లికి వందనం రెండో విడత కోసం ఎదురుచూపులు – మొదటి విడతలో పేరు రాని వారికి మరో అవకాశం కల్పించండి. B. బంగార్రాజు

అర్హులైన విద్యార్థులపై స్పష్టత ఇవ్వండి.. విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, సెప్టెంబర్ 21 (పున్నమి): తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత అర్హుల జాబితా ఎప్పుడు విడుదల అవుతుందో స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రుల తరఫున ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బొద్దపు బంగార్రాజు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అర్హత ఉన్నప్పటికీ మొదటి విడతలో విద్యార్థుల పేర్లు రాని కుటుంబాలు రెండో విడతపై ఆశగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు. తమ పిల్లలు పథకానికి అర్హులైనప్పటికీ మొదటి విడతలో పేరు లేకపోవడంతో, రెండో విడతలోనైనా అవకాశం లభిస్తుందా అనే ఆందోళన తల్లిదండ్రుల్లో ఉందన్నారు. ఈ విషయంపై పలువురు తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారులను, సంబంధిత సచివాలయ సిబ్బందిని సంప్రదించి రెండో లిస్టు ఎప్పుడు వస్తుందని ఆరా తీస్తున్నారని, అయితే ప్రస్తుతానికి ఖచ్చితమైన తేదీని తెలియజేయలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో “రెండో విడత జాబితా ఎప్పుడు విడుదల అవుతుంది? మొదటి విడతలో పేరు రాని అర్హులైన విద్యార్థులకు అవకాశం ఉంటుందా?” అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. అందువల్ల సంబంధిత అధికారులు రెండో విడత జాబితా విడుదల తేదీపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మొదటి విడతలో పేరు రాని అర్హులైన విద్యార్థుల వివరాలను మరోసారి పరిశీలించి, నిబంధనల ప్రకారం వారికి కూడా అవకాశం కల్పించాలని బంగార్రాజు విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన ఏ విద్యార్థి కూడా అనవసరమైన సందేహానికి గురికాకుండా రెండో విడతకు సంబంధించిన మార్గదర్శకాలు, అర్హుల జాబితా విడుదల ప్రక్రియపై స్పష్టమైన సమాచారం అందించాలని ఆయన కోరారు. “తల్లిదండ్రుల్లో నెలకొన్న సందేహాలకు అధికారికంగా స్పష్టత లభిస్తే, అర్హులైన కుటుంబాలకు ఎంతో ఊరట కలుగుతుంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి నిబంధనల ప్రకారం పథకం ప్రయోజనం అందాలని తల్లిదండ్రుల తరఫున కోరుతున్నాం” అని బంగార్రాజు తెలిపారు.

అర్హులైన విద్యార్థులపై స్పష్టత ఇవ్వండి..

విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, సెప్టెంబర్ 21 (పున్నమి):

తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత అర్హుల జాబితా ఎప్పుడు విడుదల అవుతుందో స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రుల తరఫున ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బొద్దపు బంగార్రాజు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా అర్హత ఉన్నప్పటికీ మొదటి విడతలో విద్యార్థుల పేర్లు రాని కుటుంబాలు రెండో విడతపై ఆశగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు. తమ పిల్లలు పథకానికి అర్హులైనప్పటికీ మొదటి విడతలో పేరు లేకపోవడంతో, రెండో విడతలోనైనా అవకాశం లభిస్తుందా అనే ఆందోళన తల్లిదండ్రుల్లో ఉందన్నారు.

ఈ విషయంపై పలువురు తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారులను, సంబంధిత సచివాలయ సిబ్బందిని సంప్రదించి రెండో లిస్టు ఎప్పుడు వస్తుందని ఆరా తీస్తున్నారని, అయితే ప్రస్తుతానికి ఖచ్చితమైన తేదీని తెలియజేయలేకపోతున్నారని పేర్కొన్నారు.

దీంతో “రెండో విడత జాబితా ఎప్పుడు విడుదల అవుతుంది? మొదటి విడతలో పేరు రాని అర్హులైన విద్యార్థులకు అవకాశం ఉంటుందా?” అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి.

అందువల్ల సంబంధిత అధికారులు రెండో విడత జాబితా విడుదల తేదీపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మొదటి విడతలో పేరు రాని అర్హులైన విద్యార్థుల వివరాలను మరోసారి పరిశీలించి, నిబంధనల ప్రకారం వారికి కూడా అవకాశం కల్పించాలని బంగార్రాజు విజ్ఞప్తి చేశారు.

అర్హత కలిగిన ఏ విద్యార్థి కూడా అనవసరమైన సందేహానికి గురికాకుండా రెండో విడతకు సంబంధించిన మార్గదర్శకాలు, అర్హుల జాబితా విడుదల ప్రక్రియపై స్పష్టమైన సమాచారం అందించాలని ఆయన కోరారు.

“తల్లిదండ్రుల్లో నెలకొన్న సందేహాలకు అధికారికంగా స్పష్టత లభిస్తే, అర్హులైన కుటుంబాలకు ఎంతో ఊరట కలుగుతుంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి నిబంధనల ప్రకారం పథకం ప్రయోజనం అందాలని తల్లిదండ్రుల తరఫున కోరుతున్నాం” అని బంగార్రాజు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.