నెల్లూరు సిటీ విజయమహాల్ గేట్ సమీపంలోని సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో, చికిత్స పొందుతూ రోగి మృతి చెందిన ఘటనపై బంధువులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిన్నబజార్ సీఐ శ్రీనివాసులు స్పందించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం ఉందా లేదా అనే అంశాన్ని దర్యాప్తులో తేలుస్తామని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు. రోగి మృతికి గల కారణాలు, చికిత్స అందించిన విధానం తదితర అంశాలను విచారణలో తెలుస్తాం అని తెలిపారు .

సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రోగి మృతి.. విచారణకు సిద్ధమన్న పోలీసులు..