Saturday, 4 July 2026
  • Home  
  • సోషల్ వెల్ఫేర్ గురుగుల కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

సోషల్ వెల్ఫేర్ గురుగుల కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు

ఆసిఫాబాద్, జూలై 4: కుమురంభీమ్-ఆసిఫాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో వివిధ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి అబ్దుల్ రహీమ్ తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ గౌరవ కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని గురుకుల కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బాలుర విభాగంలో ఎంపీసీ గ్రూపులో 16, బైపీసీ గ్రూపులో 21, సీఈసీ గ్రూపులో 34, ఎంఈసీ గ్రూపులో 37 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే బాలికల విభాగంలో ఎంపీసీ గ్రూపులో 40, బైపీసీ గ్రూపులో 22, సీఈసీ గ్రూపులో 28, హెచ్ఈసీ గ్రూపులో 23 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఖాళీ సీట్ల భర్తీ కోసం జూలై 6, 2026 సోమవారం రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ టీసీ, బోనాఫైడ్, కుల ధ్రువపత్రం, నివాస ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం మరియు ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో హాజరై రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అలాగే, ఈ స్పాట్ కౌన్సిలింగ్‌కు మార్చి-2026లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులు అని తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ ప్రవేశాలకు అర్హులని స్పష్టం చేశారు.

ఆసిఫాబాద్, జూలై 4: కుమురంభీమ్-ఆసిఫాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో వివిధ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి అబ్దుల్ రహీమ్ తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ గౌరవ కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
జిల్లాలోని గురుకుల కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బాలుర విభాగంలో ఎంపీసీ గ్రూపులో 16, బైపీసీ గ్రూపులో 21, సీఈసీ గ్రూపులో 34, ఎంఈసీ గ్రూపులో 37 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే బాలికల విభాగంలో ఎంపీసీ గ్రూపులో 40, బైపీసీ గ్రూపులో 22, సీఈసీ గ్రూపులో 28, హెచ్ఈసీ గ్రూపులో 23 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ఖాళీ సీట్ల భర్తీ కోసం జూలై 6, 2026 సోమవారం రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ టీసీ, బోనాఫైడ్, కుల ధ్రువపత్రం, నివాస ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం మరియు ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో హాజరై రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
అలాగే, ఈ స్పాట్ కౌన్సిలింగ్‌కు మార్చి-2026లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులు అని తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ ప్రవేశాలకు అర్హులని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.