అనంతగిరి మండలంలో భారతీయ జనతా పార్టీ విజయాన్నే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు, జిల్లా ఉపాధ్యక్షులు శెట్టి రాజు పిలుపునిచ్చారు.
గురువారం అనంతగిరి మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకులు,కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విశాఖ/అల్లూరి ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికై కేటాయిస్తున్న ప్రత్యేక నిధుల గురించి ప్రతి ఇంటికీ వివరించాలని సూచించారు. కాఫీ రైతులకు, గిరిజన సోదరులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు ప్రతి పంచాయతీలోనూ ‘మన జెండా – మన ఊరు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలోనూ పార్టీ జెండా ఎగురవేస్తూ, గ్రామ కమిటీలను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల యువమోర్చా అధ్యక్షులు బాడం మధుసూదన్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసరావు, మండల కోశాధికారి వంతల అప్పన్న, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చిట్టం సింహాద్రిలతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి:శెట్టి రాజు
అనంతగిరి మండలంలో భారతీయ జనతా పార్టీ విజయాన్నే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు, జిల్లా ఉపాధ్యక్షులు శెట్టి రాజు పిలుపునిచ్చారు. గురువారం అనంతగిరి మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకులు,కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విశాఖ/అల్లూరి ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికై కేటాయిస్తున్న ప్రత్యేక నిధుల గురించి ప్రతి ఇంటికీ వివరించాలని సూచించారు. కాఫీ రైతులకు, గిరిజన సోదరులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు ప్రతి పంచాయతీలోనూ ‘మన జెండా – మన ఊరు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలోనూ పార్టీ జెండా ఎగురవేస్తూ, గ్రామ కమిటీలను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువమోర్చా అధ్యక్షులు బాడం మధుసూదన్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసరావు, మండల కోశాధికారి వంతల అప్పన్న, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చిట్టం సింహాద్రిలతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

