పెనగలూరు మండల కేంద్రంలో రూ.2.12 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాల నూతన భవనాన్ని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్చార్జ్, కూడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు, రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ కస్తూరి విశ్వనాథ నాయుడు గారు, తాతం శెట్టి నాగేంద్ర గారు, పంతగాని నరసింహ ప్రసాద్ గారు, కేకే చౌదరి గారు, విశ్వేశ్వర నాయుడు గారు,నారాయణ రెడ్డి గారు ,నరసింహ రెడ్డి గారు,దామోదర్ నాయుడు గారు, బాలకృష్ణ గారు,,కాపేర్ల నాగార్జున గారు, గుత్తి నరసింహ గారు ,NDA కూటమి నాయుకులు అధికారులతో కలిసి ప్రారంభించారు,
నూతన భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాయకులకు విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన భవనాన్ని పరిశీలించిన నాయకులు.. విద్యార్థినులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతులు, విద్యాసంస్థ అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు మాట్లాడుతూ..
ఆడబిడ్డలకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు ఉన్నత విద్యా అవకాశాలను మరింత చేరువ చేయడంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ మాట్లాడుతూ..విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.2.12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన భవనం విద్యాభ్యాసానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలను పెంపొందించుకుని విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.ప్రతి విద్యార్థినికి మెరుగైన విద్యా అవకాశాలు, అవసరమైన మౌలిక వసతులు అందేలా కృషి చేయడం సమాజ భవిష్యత్తుకు చేసే అత్యంత విలువైన పెట్టుబడి అని పేర్కొన్నారు.విద్యతో సాధికారత.. మౌలిక వసతులతో మరింత బలమైన భవిష్యత్తు..పెనగలూరు మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చిన ఈ నూతన విద్యా భవనం.. ఆడబిడ్డల విద్యాభ్యాసానికి మరింత మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు, వారి ఉన్నత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

పెనగలూరు లో రూ.2.12 కోట్లతో ఆధునిక విద్యా భవనాన్ని ప్రారంభించిన ముక్కా రూపానంద రెడ్డి మరియు అరవ శ్రీధర్
పెనగలూరు మండల కేంద్రంలో రూ.2.12 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాల నూతన భవనాన్ని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్చార్జ్, కూడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు, రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ కస్తూరి విశ్వనాథ నాయుడు గారు, తాతం శెట్టి నాగేంద్ర గారు, పంతగాని నరసింహ ప్రసాద్ గారు, కేకే చౌదరి గారు, విశ్వేశ్వర నాయుడు గారు,నారాయణ రెడ్డి గారు ,నరసింహ రెడ్డి గారు,దామోదర్ నాయుడు గారు, బాలకృష్ణ గారు,,కాపేర్ల నాగార్జున గారు, గుత్తి నరసింహ గారు ,NDA కూటమి నాయుకులు అధికారులతో కలిసి ప్రారంభించారు, నూతన భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాయకులకు విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన భవనాన్ని పరిశీలించిన నాయకులు.. విద్యార్థినులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతులు, విద్యాసంస్థ అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు ఉన్నత విద్యా అవకాశాలను మరింత చేరువ చేయడంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ మాట్లాడుతూ..విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.2.12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన భవనం విద్యాభ్యాసానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలను పెంపొందించుకుని విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.ప్రతి విద్యార్థినికి మెరుగైన విద్యా అవకాశాలు, అవసరమైన మౌలిక వసతులు అందేలా కృషి చేయడం సమాజ భవిష్యత్తుకు చేసే అత్యంత విలువైన పెట్టుబడి అని పేర్కొన్నారు.విద్యతో సాధికారత.. మౌలిక వసతులతో మరింత బలమైన భవిష్యత్తు..పెనగలూరు మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చిన ఈ నూతన విద్యా భవనం.. ఆడబిడ్డల విద్యాభ్యాసానికి మరింత మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు, వారి ఉన్నత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

