నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాళెం కలుజుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం అక్టోబర్ 2న ఉదయం 9:33 గంటలకు జరగనుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. ఈ బ్రిడ్జి నెల్లూరు రూరల్‌తో పాటు కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి, ఉదయగిరి ప్రాంతాల ప్రజలకు అనుసంధాన మార్గంగా ఉపయోగపడుతుందని చెప్పారు. బాంబే రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గంగా ఇది ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

అక్టోబర్ 2న పొట్టేపాళెం కలుజు బ్రిడ్జి ప్రారంభోత్సవం