కుబీర్: కుబీర్ మండలం సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పాలజ్ గణేష్ ఆలయంలో** గణేష్ ఉత్సవాల సందర్భంగా పూజలందుకున్న వస్తువులను వేలం వేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది.గణేష్ ఉత్సవాల సందర్భంగా 12 రోజుల పాటు పాలజ్ కర్ర గణపతి చెంత పూజలందుకున్న పలక, బలపం, కాపీ–పెన్ను, లాకర్, కండువా, మహా లడ్డూ తదితర వస్తువులను వేలం వేయనున్నట్లు తెలిపింది. ఈ వస్తువులను వేలం ద్వారా భక్తులకు అందించనున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ నెల 24వ తేదీన (24-09-2026) ఉదయం 7 గంటలకు పాలజ్ శ్రీ గణేష్ మందిర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలం కార్యక్రమం నిర్వహించనున్నారు. పూజలందుకున్న వస్తువులను పొందేందుకు భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ కోరింది.

పాలజ్ శ్రీ గణేష్ ఆలయంలో పూజలందుకున్న వస్తువుల వేలం కర్ర గణపతి చెంత 12 రోజుల పాటు పూజలు.. తేదీ :24న వేలం