Wednesday, 30 September 2026
  • Home  
  • భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- అనకాపల్లి

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని సీఐటీయూ వినతి పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) యలమంచిలి: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించి, సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యలమంచిలి కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన, గాయపడిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అర్హులైన కార్మికులందరినీ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేర్చాలని, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల నుంచి సంక్షేమ బోర్డుకు చెల్లిస్తున్న నిధులను వారి సంక్షేమానికే వినియోగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందక రామకృష్ణ, శ్రీ దుర్గాంబిక భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు సేరం రాంబాబు, శ్రీ మణికంఠ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాజన్న రాంబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము పాల్గొన్నారు.

సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని సీఐటీయూ వినతి

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)

యలమంచిలి: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించి, సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యలమంచిలి కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ప్రమాదవశాత్తు మృతి చెందిన, గాయపడిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అర్హులైన కార్మికులందరినీ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేర్చాలని, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల నుంచి సంక్షేమ బోర్డుకు చెల్లిస్తున్న నిధులను వారి సంక్షేమానికే వినియోగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందక రామకృష్ణ, శ్రీ దుర్గాంబిక భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు సేరం రాంబాబు, శ్రీ మణికంఠ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాజన్న రాంబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.