నందిగామ ప్రతినిధి
స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్లో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు, నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ తంబళ్ళపల్లి రమాదేవి సూచనలతో నందిగామ PACS చైర్మన్ కొట్టె హరికృష్ణ (బద్రి) భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు బద్రి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.స్వాతంత్ర్య సమరంలో భగత్ సింగ్ ప్రదర్శించిన ధైర్యం, దేశభక్తి, త్యాగం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చిన్న వయసు లోనే దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన భగత్ సింగ్ వంటి మహనీయుల ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, పల్లగిరి గ్రామ అధ్యక్షులు కటరపు జయరాజు, జుజ్జూరు జనసేన నాయకులు కావేటి కృష్ణ, కొలగట్ల గోపాలకృష్ణ, సూర్య వెంకీ, నల్లగొండ సాయి, వీర మహిళ కామసాని సుగుణ తదితరులు పాల్గొన్నారు.


