Wednesday, 30 September 2026
  • Home  
  • కాకినాడలో వైభవంగా ‘అంగన్‌వాడీ ఉత్సవం’ – అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సత్కారం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకినాడలో వైభవంగా ‘అంగన్‌వాడీ ఉత్సవం’ – అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సత్కారం

కాకినాడ నియోజకవర్గ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో, కాకినాడ 28వ డివిజన్ లోని నెల్లెప్పన్ సెంటర్ రాజాజీ స్ట్రీట్, సూర్యనారాయణపురం అంగన్‌వాడీ కేంద్రాలలో ‘అంగన్‌వాడీ ఉత్సవం’అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుంకర పావని తిరుమల కుమార్ మాట్లాడుతూ పసిపిల్లల సమగ్ర వికాసానికి, గర్భిణులు మరియు బాలింతలకు సరైన పోషకాహారం అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.సమాజంలో చిన్నారులను ఎంతో ప్రేమతో, ఓపికతో లాలిస్తూ బాధ్యతాయుతంగా సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.అనంతరం ఆయా కేంద్రాలలో నిరంతరం శ్రమిస్తూ నిబద్ధతతో సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లను మరియు ఆయాలను సుంకర పావని తిరుమల కుమార్ శాలువాలు,జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కాకినాడ నియోజకవర్గ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో, కాకినాడ 28వ డివిజన్ లోని నెల్లెప్పన్ సెంటర్ రాజాజీ స్ట్రీట్, సూర్యనారాయణపురం అంగన్‌వాడీ కేంద్రాలలో ‘అంగన్‌వాడీ ఉత్సవం’అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
ఈ ఉత్సవంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుంకర పావని తిరుమల కుమార్ మాట్లాడుతూ పసిపిల్లల సమగ్ర వికాసానికి, గర్భిణులు మరియు బాలింతలకు సరైన పోషకాహారం అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.సమాజంలో చిన్నారులను ఎంతో ప్రేమతో, ఓపికతో లాలిస్తూ బాధ్యతాయుతంగా సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.అనంతరం ఆయా కేంద్రాలలో నిరంతరం శ్రమిస్తూ నిబద్ధతతో సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లను మరియు ఆయాలను సుంకర పావని తిరుమల కుమార్ శాలువాలు,జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.