అరకులోయ, అక్టోబర్ 1: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాల మేరకు బోటనీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కాఫీ సాగుతో గిరిజన ప్రాంత ప్రజలకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ముఖ్య అతిథి జూనియర్ లైజన్ కాఫీ ఆఫీసర్ లక్ష్మి కాఫీ సాగు పద్ధతులు, మొక్కల సంరక్షణ, రైతులకు అందుతున్న సాంకేతిక సహకారంపై అవగాహన కల్పించారు. టెక్నికల్ అసిస్టెంట్ రవికుమార్ మొక్కల పెంపకం, నీడ నిర్వహణ, తెగుళ్ల నివారణ, కాఫీ గింజల నాణ్యతపై వివరించారు. బోటనీ విభాగాధిపతి డా. చి. మురళీకృష్ణ, అధ్యాపకురాలు ఎన్. శ్రావణి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అరకు: మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ కాఫీ దినోత్సవం