ముంబై:- అంతర్జాతీయ అనిశ్చితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘3-Fs’ (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్) పొదుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు.
నిరాశావాదం వద్దు: దేశీయ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని, జీఎస్‌టీ వసూళ్లు, వాహన విక్రయాలు సానుకూలంగా ఉన్నాయని.. ప్రజల్లో అనవసర భయాలు సృష్టించవద్దని మంత్రి హితవు పలికారు.
₹1 లక్ష కోట్ల ప్రభావం: డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం కోత వల్ల ఖజానాపై దాదాపు లక్ష కోట్ల వరకు ప్రభావం పడనుంది.
MSMEలకు ఊరట: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ₹8.1 లక్షల కోట్ల బకాయిలను, ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజులలోపు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అప్పుడే మధ్యతరగతి బాగుండి ‘వికసిత్ భారత్’ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.


