ఖమ్మం జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల హాస్టల్ వెల్ఫేర్ అధికారులు విధిగా హాస్టళ్లలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. ఆదేశించారు. రాత్రివేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, అధికారి అందుబాటులో లేకుంటే సస్పెన్షన్ తప్పదని స్పష్టం చేశారు. సూపర్వైజింగ్ అధికారులు వారానికి రెండుసార్లు హాస్టళ్లను తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యత లేని ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.



