Monday, 21 September 2026
  • Home  
  • హత్యాయత్నం కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్
- తిరుపతి

హత్యాయత్నం కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని కేఎస్ అగ్రహారం గ్రామంలో హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. తన రెండో భార్యతో తన తండ్రి మొదటి భార్య కుమారుడైన శివయ్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో మోసాటి మల్లేశ్వర ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 19న మధ్యాహ్నం 2.45 గంటలకు మల్లేశ్వర, శివయ్యలు పొలానికి ఎరువు చల్లేందుకు వెళ్తుండగా, శివయ్య ఎరువు మూటతో ముందుగా వెళ్తున్న సమయంలో మల్లేశ్వర వెనుక నుంచి కొడవలితో అతని మెడపై పలుమార్లు దాడి చేశాడు. తీవ్ర రక్తగాయాలైన శివయ్యను చికిత్స కోసం తరలించారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. రేణిగుంట ఎస్‌డీపీఓ ఆధ్వర్యంలో, కోడూరు రూరల్ సీఐ సూచనల మేరకు చిట్వేల్ ఎస్‌ఐ ఎస్. వినోద్‌కుమార్ దర్యాప్తు చేపట్టి సోమవారం మల్లేశ్వరను అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం మల్లేశ్వరను జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.