చెన్నారావుపేట, సెప్టెంబర్ 28( పున్నమి ): స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మండల పంచాయతీ అధికారి తండ జగదీష్ అన్నారు. సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తండ జగదీష్ స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమాల పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపిఎం తిలక్ కుమార్, ఎస్ బిఎం కోఆర్డినేటర్ శ్రీనివాస్ రావు, కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ మెట్టుపల్లి జ్యోతి, సీసీ కట్టయ్య, సిఏ సుధ, ఆశాజ్యోతి మండల సమైక్య కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోశాధికారి గంగిడి కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి