Monday, 14 September 2026
  • Home  
  • సోదరభావానికి ప్రతీక రక్షాబంధన్: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోదరభావానికి ప్రతీక రక్షాబంధన్: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

కలిగిరి, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 28: అక్కాతమ్ముళ్లు, అన్నచెల్లెళ్ల అనురాగానికి, పవిత్ర సోదరభావానికి రక్షాబంధన్ పండుగ ప్రతీక అని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో రక్షాబంధన్ మహోత్సవానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందన్నారు. కులమతాలకు అతీతంగా సమాజంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఈ పండుగ సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. ఆడపడుచులందరి జీవితాల్లో ఈ పండుగ వెలుగులు నింపాలని, ప్రతి ఒక్క సోదరి రక్షణకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అన్నాచెల్లెళ్ల అనుబంధం నిరంతరం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. పండుగను నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.