ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 22 (జీఎంకే రావ్ పున్నమి ప్రతినిధి).సెలవుల్లో విద్యార్థులు ఎండలకు బయట తిరగకుండా ఇంటి వద్దనే లీప్ యాప్ ద్వారా చదువు కొనసాగించాలని ఎంఈఓ నరేష్ కుమార్ సూచించారు. రేపటితో పాఠశాలలకు చివరి పని దినమని, జూన్ 12న తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. జిఎల్ఎఫ్ వల్ల విద్యార్థుల అవగాహన, గణితం, సైన్స్, చదవడం, రాయడంలో మెరుగుదల వచ్చిందన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

సెలవుల్లోనూ లీప్ యాప్‌తో చదువు కొనసాగించాలి: ఎంఈఓ