*సీనియర్ నాయకులు కృష్ణ మేస్త్రి మృతికి ఎమ్మెల్యే సంతాపం*
పలమనేరు, అక్టోబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) :
పలమనేర్ పట్టణానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణ మేస్త్రి మృతి పట్ల పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదాన్ని గురైన కృష్ణ మేస్త్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి కృష్ణా మేస్త్రి భౌతిక కాయాన్ని సదర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబికులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి మేస్త్రి కృష్ణ అంకితభావంతో పనిచేసిన నాయకుడని ఆయన సేవలు మరువలేనివని, ఓ మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్యే సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంతాప కార్యక్రమంలో నాయకులు ఆర్.వి బాలాజీ, బ్రహ్మయ్య, ఆర్బీసీ కుట్టి,గిరిబాబు, కృష్ణమూర్తి గౌడు, డిష్ రమేష్, నాగరాజు,ఖాజా, సురేష్, మదన్,రమేష్, సుదర్శన్ బాలాజీ, కోటి, అఫ్రోజ్,నదీమ్, చెన్న రాయప్ప, సుధాకర్, వీరప్ప,శ్రీనివాసులు, మోహన, రామూర్తి,సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు..
