దేశంలో మతతత్వ, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అన్నారు.
సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు సీతారాం ఏచూరి తనదైన ముద్ర వేశారని అన్నారు. పేదలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడిన ప్రజానాయకుడిగా ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు.
దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, లౌకికవాదం, సామాజిక సమానత్వం కోసం సీతారాం ఏచూరి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ ప్రజలను ఐక్యం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మతతత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే సీతారాం ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని వారు పేర్కొన్నారు.
సీతారాం ఏచూరి చూపిన ప్రజా పోరాటాల మార్గంలో పయనిస్తూ పేదలు, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, కలకోట అనిల్, ఎండీ ఫరీదా,వజ్జంతీ విజయ, బిట్ర స్వప్న, కలకోట అనిల్ లక్క రాజు ఉదయగిరి సరిత జగన్నాథం కార్తిక్ కందికొండ సంతోష్, ప్రశాంత్, నర్సింహ రాములు, వీరన్న తదితరులు పాల్గొన్నారు

సీతారాం ఏచూరి ఆశయాల సాధనకు కృషి చేయాలి-సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్
దేశంలో మతతత్వ, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అన్నారు. సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు సీతారాం ఏచూరి తనదైన ముద్ర వేశారని అన్నారు. పేదలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడిన ప్రజానాయకుడిగా ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, లౌకికవాదం, సామాజిక సమానత్వం కోసం సీతారాం ఏచూరి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ ప్రజలను ఐక్యం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మతతత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే సీతారాం ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని వారు పేర్కొన్నారు. సీతారాం ఏచూరి చూపిన ప్రజా పోరాటాల మార్గంలో పయనిస్తూ పేదలు, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, కలకోట అనిల్, ఎండీ ఫరీదా,వజ్జంతీ విజయ, బిట్ర స్వప్న, కలకోట అనిల్ లక్క రాజు ఉదయగిరి సరిత జగన్నాథం కార్తిక్ కందికొండ సంతోష్, ప్రశాంత్, నర్సింహ రాములు, వీరన్న తదితరులు పాల్గొన్నారు

