Friday, 17 July 2026
  • Home  
  • సీఎం సహాయ నిధితో బందనకల్ కుటుంబాలకు భరోసా.. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
- రాజన్న సిరిసిల్ల

సీఎం సహాయ నిధితో బందనకల్ కుటుంబాలకు భరోసా.. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా జూలై 17. పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరే మల్లేష్‌కు రూ.55,000, పాతూరు బుచ్చిరెడ్డికి రూ.19,000, వడ్ల చంద్రకళకు రూ.17,000, కస్తూరి గల్‌రెడ్డికి రూ.21,500 విలువైన చెక్కులు అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్‌రెడ్డి గారికి, మండల కాంగ్రెస్ నాయకులు గజ్జల రాజు గారికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బందనకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు రంజిత్, పొన్నం రాజా, ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, కార్తీక్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా జూలై 17. పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరే మల్లేష్‌కు రూ.55,000, పాతూరు బుచ్చిరెడ్డికి రూ.19,000, వడ్ల చంద్రకళకు రూ.17,000, కస్తూరి గల్‌రెడ్డికి రూ.21,500 విలువైన చెక్కులు అందజేశారు.
ఆపద సమయంలో ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్‌రెడ్డి గారికి, మండల కాంగ్రెస్ నాయకులు గజ్జల రాజు గారికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బందనకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు రంజిత్, పొన్నం రాజా, ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, కార్తీక్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.