ఖమ్మం నగరం లోని ప్రముఖ విద్యా సంస్థ నిర్మల్ హృదయ్ స్కూల్ అధినేత వంగా సాంబశివ రెడ్డి ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాంబశివ రెడ్డి నివాసానికి వెళ్లిన పువ్వాడ అజయ్ కుమార్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాంబశివ రెడ్డి మృతి విద్యారంగానికి, సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.



