నల్లబెల్లి మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి అకాల మరణం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లెంకలపల్లి గ్రామంలోని ఆమె నివాసానికి చేరుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, విజయలక్ష్మి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. విజయలక్ష్మి మృతి వారి కుటుంబానికే కాకుండా పార్టీకి తీరని లోటని, ఈ కష్టసమయంలో కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం జరిగిన ఆమె అంతిమయాత్రలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని పాడె మోసారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
నల్లబెల్లి మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి అకాల మరణం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లెంకలపల్లి గ్రామంలోని ఆమె నివాసానికి చేరుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, విజయలక్ష్మి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. విజయలక్ష్మి మృతి వారి కుటుంబానికే కాకుండా పార్టీకి తీరని లోటని, ఈ కష్టసమయంలో కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం జరిగిన ఆమె అంతిమయాత్రలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని పాడె మోసారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

